అక్షరటుడే, ఇందూరు: నగరంలో వినాయక నిమజ్జనానికి రథం సిద్ధమైంది. నగరంలోని రైల్వే గేటు సమీపంలో ఉన్న గణపతి ఆలయం ముందు మంగళవారం ఉదయం రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతి ఆలయం నుంచి దుబ్బ చౌరస్తాకు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటలకు శోభాయాత్ర బయలుదేరనుంది.