అక్షరటుడే, కామారెడ్డి: శాంతి సామరస్యాలకు ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన కామారెడ్డిలోని అమరవీల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాల నుంచి 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ భారత్‌లో కలిసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధుశర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌వో నిఖిత, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ పాల్గొన్నారు.