అక్షరటుడే, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్ పార్థసారధి పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగిసింది. దీంతో నూతన కమిషనర్‌గా రాణికుముదిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె మూడేళ్ల కాలం పాటు ఎస్ఈసీగా పదవిలో కొనసాగనున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నియామకానికి ప్రాధాన్యత ఏర్పడింది. 1988 బ్యాచ్‌కు చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.