అక్షరటుడే, వెబ్ డెస్క్ : బుల్డోజర్‌ యాక్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్ల ప్రయోగంపై స్టే విధిస్తూ ఆదేశించింది. అక్టోబర్‌ 1 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. అయితే ప్రభుత్వ ఆస్తులు, పుట్‌పాత్‌లు, రోడ్లు, చెరువులు ఆక్రమించిన వారి విషయంలో ఈ ఆదేశాలు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.