అక్షరటుడే, నిజామాబాద్: జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన కులాచారి దినేశ్ తెలిపారు. రూరల్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన ఎంపీ అరవింద్ కు ధన్యవాదాలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసేలా చూస్తానని చెప్పారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలపడిందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని పేర్కొన్నారు. గురువారం జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీపీ గద్దె భూమన్న, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.