విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి

0

అక్షరటుడే, ఇందూరు: విద్యా రంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే బడ్జెట్లో విద్యా రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యార్థులకు అందించే స్కాలర్షిప్స్, మెస్ ఛార్జీలు పెంచాలని కోరారు.