అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని ఇన్ఫినిటీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఈ నెల 19న టేస్టీ తెలంగాణ ట్రీట్స్‌ పేరిట వంట పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాకుడు రత్నాకర్‌ తెలిపారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ చెఫ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 19న రెండు రాష్ట్రాల్లో పోటీలను నిర్వహించిన అనంతరం ఫైనల్స్‌ హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 81061 82233 నంబర్ ను సంప్రదించాలని కోరారు.