అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: దేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ రాహుల్ గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ గాంధీ హత్యకు సైతం కుట్ర పన్నారని ఆరోపించారు. పార్టీ అగ్రనేత గురించి తప్పుగా మాట్లాడుతున్న నాయకులపై ఒకటోటౌన్‌లో ఫిర్యాదు చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.