అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్(ఎస్‌డీపీ) యంత్రం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ యంత్రాన్ని ఆవిష్కరించారు. దీని విలువ రూ. 40 లక్షలు ఉంటుందని, యంత్రం సహాయంతో రోగి అవసరాన్ని బట్టి ఒకే దాత నుంచి ప్లేట్‌లెట్లను సేకరించవచ్చన్నారు. రూ.15 వేల వరకు ఖర్చయ్యే ఈ ప్రక్రియ జిల్లా ఆస్పత్రిలో ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ ప్రక్రియలో గంట వ్యవధిలోనే రక్తం నుంచి ప్లేట్ లెట్లు విడుదల అవుతాయని, దాత 72 గంటల తర్వాత మళ్లీ ప్లేట్‌లెట్లు దానం చేయవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఇమ్రాన్ అలీ, బ్లడ్ బ్యాంక్ ఇన్ చార్జి చందు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.