అక్షరటుడే, కామారెడ్డి : ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులతో కలిసి నిద్రించారు. శుక్రవారం రాత్రి వసతి గృహానికి వెళ్లిన ఆయన.. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇష్టపడి చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఆర్డీవో ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఎడి దయానంద్, అధికారులున్నారు.