డిచ్పల్లి ఎంపీపీపై అవిశ్వాసం.. కోర్టు స్టే..!

0

అక్షరటుడే , నిజామాబాద్ రూరల్: బలహీన వర్గానికి చెందిన తనను పదవి నుంచి దించేందుకు కుట్ర చేశారని, చివరకు న్యాయమే గెలిచిందని డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న అన్నారు. ఆదివారం ఆయన డిచ్పల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి, మాజీ మంత్రి మండవ కలిసి తనను పదవి నుంచి దింపేయాలని ఎంపీటీసీలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారన్నారు. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై తాను కోర్టును ఆశ్రయించడంతో స్టే లభించిందన్నారు. కోర్టు తీర్పుతో తనకు న్యాయం జరిగిందని.. ఈ తీర్పు కాంగ్రెస్ నాయకులకు చెంపపెట్టు అని పేర్కొన్నారు.