అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ తప్పు కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలను కలిగి ఉండడం ఫోక్సో చట్టం ప్రకారం నేరమని తన తీర్పులో స్పష్టం చేసింది. సీజేఐ చంద్రచూడ్, జేబీ పర్దివాలా ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించారు.