సీఐ ప్రేమ్ కుమార్ కు బెయిల్..

0

అక్షరటుడే, నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులో సహకరించి అరెస్ట్ అయిన సీఐ ప్రేమ్ కుమార్ కు బెయిల్ లభించింది. పంజాగుట్ట పోలీసులు ఆదివారం సీఐను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. కాగా.. ప్రస్తుతం సీసీఎస్ లో పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ బోధన్ ఎస్ హెచ్ వో గా పనిచేసిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కు అత్యంత సన్నిహితుడు అనే ముద్ర ఉంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కార్యకర్త కంటే ఎక్కువగా షకీల్ కోసం పనిచేశారని ప్రచారంలో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రేమ్ ను ఎస్ హెచ్ వో బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా ఈ కేసులో ఇరుక్కున్నారు. త్వరలోనే శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.