అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి జైలు శిక్ష కూడా అమలు చేస్తున్నారు. కానీ, ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో కారు తోలి ప్రమాదానికి కారణమ య్యాడు. ఆదివారం రాత్రి ఖానాపూర్ బైపాస్ రోడ్డులో జరిగిన యాక్సిడెంట్ లో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నాడు. ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ ప్రస్తుతం భీంగల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తు న్నట్లు సమాచారం. సదరు కానిస్టేబుల్ గతంలో రూరల్ పీస్ లో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యాడు. ప్రమాదం జరిగింది వాస్తవమేనని, తమకు ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని రూరల్ పీఎస్ ఎస్సై – 2 రామారావు తెలపడం గమనార్హం.