అక్షర టుడే,ఆర్మూర్: ఆర్మూర్ రాంనగర్ కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు, స్వాతంత్య్ర సమరయోధుడు శ్యాంసుందర్ రెడ్డి(94) సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. శ్యాంసుందర్ రెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్ష అనుభవించారు. అలాగే స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆయన మృతి పట్ల పట్టణ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆర్మూర్లో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు గంగా మోహన్ చక్రు , సుంకరి రంగన్న తదితరులు పాల్గొన్నారు.