అక్షరటుడే, భిక్కనూరు: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పటాన్ చెరులో చేపట్టిన సమావేశానికి భిక్కనూరుకు చెందిన రేషన్ డీలర్లు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు చంద్రం మాట్లాడుతూ ప్రభుత్వం డీలర్లకు చాలీచాలని కమీషన్లు ఇస్తుండడంతో కుటుంబం నడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అప్పుల పాలవుతున్నామని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు కమీషన్ ను క్వింటాలుకు రూ.300 పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశానికి వెళ్లిన వారిలో మండల సెక్రెటరీ శ్రీనివాస్, సభ్యులు సామల భరత్ కుమార్, జగదీశ్వర్ గుప్తా, భాస్కర్ రెడ్డి, మల్లేశం గుప్తా, పుల్లూరి రామస్వామి తదితరులు ఉన్నారు.