అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మహిళ హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. కామారెడ్డి జిల్లా ముదెల్లికి చెందిన అంజయ్యకు గాంధారి మండలం జేకే తండాకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయాన్ని అతని భార్య కాశమణి కుటుంబ సభ్యులకు తెలిపింది. అయినప్పటికీ అతను వివాహేతర సంబంధం కొనసాగించడంతో.. తన కుటుంబం నష్టపోతుందని భావించిన అంజయ్య భార్య.. సదరు మహిళను హతమార్చాలని నిర్ణయించుకుంది. తమ గ్రామానికి చెందిన సుతారి చిన్న బాలయ్య సాయం కోరింది. కాగా.. రూ.5వేలు ఇస్తే సహకరిస్తానని బాలయ్య తెలిపాడు. దీంతో వీరిద్దరు కలిసి పథకం ప్రకారం.. 2019 ఆగస్టు 29న మహిళను హత్య చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు తుది విచారణలో భాగంగా ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్‌ మంగళవారం తీర్పు వెల్లడించారు.