అక్షర టుడే, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో.. అక్టోబర్ 16న జరిగే విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం నాంపల్లి కోర్టు ఆదేశించింది. నాంపల్లి కోర్టులో విచారణ జరగగా.. ముత్తయ్య మినహా మిగతా నిందితులైన ప్రస్తుత రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య గైర్హాజరయ్యారు. వీరిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాగా.. అక్టోబర్ 16న జరిగే విచారణకు సీఎం రేవంత్‌రెడ్డితో సహా మిగితా నిందితులందరిని హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.