అక్షరటుడే, భీంగల్: మండలంలోని దేవనపల్లి గ్రామానికి చెందిన ప్రకాష్ (55) ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడ గుండెపోటుతో ఆయన మృతిచెందాడు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృషితో మంగళవారం అతని మృతదేహం స్వగ్రామానికి చేరింది. కాగా మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.