అక్షరటుడే, కామారెడ్డి: భిక్కనూరు మండలంలోని కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బుధవారం చెక్కులు పంపిణీ చేశారు. భిక్కనూరు రైతు వేదికలో 75 మందికి ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు రూ.లక్షతో పాటు తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఉప్పరి రమేష్, రమేష్ రెడ్డి, బండి రాములు, చిన్నోళ్ల శంకర్, యాదగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు నరేందర్ రెడ్డి, బస్వారెడ్డి, ఎంపీడీవో రవికిరణ్ రెడ్డి, ఆర్ఐ బాలయ్య స్వామి పాల్గొన్నారు.