అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన నాలుగు అంశాలపై గ్రామ నీటి సహాయకులకు శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని ఆ శాఖ ఈఈ రాకేష్ తెలిపారు. కోటగిరి, సిరికొండ, నందిపేట, భీమ్ గల్ మండలాల్లో ఇప్పటికే శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అక్టోబర్ 23 వరకు తరగతులు కొనసాగేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక వ్యక్తికి మండల స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. చేతి పంపుల మరమ్మతులు, పైపులైను లీకేజీలు అరికట్టడం, పంపుసెట్లు, ప్యానల్ బోర్డుల నిర్వహణ, నీటి నాణ్యత పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.