అక్షరటుడే, ఆర్మూర్ : పట్టణంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో మీటర్ రీడింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో అధికారులను బుధవారం సన్మానించారు. ఏఏవోగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు వారిని సన్మానించారు. కార్యక్రమంలో జేఏవోలు సంజీవ్, పోశెట్టి, ప్రకాష్, హరీష్, సూపర్‌వైజర్ శ్రావణ్, రీడింగ్ సిబ్బంది గంగాధర్, రఫీ, యూసుఫ్, శేఖర్, అజయ్, రాజశేఖర్, వాజిద్, ఇనాయత్, రేవంత్, సాయి, సోను పాల్గొన్నారు.