Advertisement
అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట్ మండలం లక్కంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, గ్రామ మాజీ సర్పంచ్ సుమలత భర్త మహేందర్ (39) మృతి చెందాడు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మహేందర్ ప్రధాన అనుచరుడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డి కోసం పనిచేశాడు. జీవనన్న యువసేన పేరిట గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాడు.
Advertisement