అక్షరటుడే, ఎల్లారెడ్డి: నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయం మళ్లీ పొంగి పొర్లుతోంది. లింగంపేట, గాంధారి, తాడ్వాయి మండలాల్లో బుధవారం వర్షం కురవడంతో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వస్తోంది. దీంతో అలుగు పారుతున్న ప్రాజెక్ట్ అందాలను చూడడానికి ప్రజలు తరలి వస్తున్నారు.