అక్షరటుడే, ఇందూరు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం ప్రముఖులు ఘననివాళులు అర్పించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ నగరంలోని వినాయక్‌నగర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన యోధురాలు చాకలి ఐలమ్మ అని వక్తలు పేర్కొన్నారు.
Advertisement

Advertisement