అక్షరటుడే, ఇందూరు: దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ జయంతిని శుక్రవారం నిర్వహించారు. నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల డీఎస్ ఘాట్ వద్ద ఎంపీ అర్వింద్ ధర్మపురి నివాళులర్పించారు. డీఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎంపీ వెంట అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ బంటు రాము, నాయకులు ఉన్నారు.