అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని శుక్రవారం పట్టణంలో నిర్వహించారు. సమావేశానికి ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు హాజరై పాలకవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు. ఛైర్ పర్సన్ గా మారెడ్డి రజిత వెంకట్రామిరెడ్డి, వైస్ ఛైర్మన్ గా జొన్నల రాజు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే, ఎంపీలు మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనన్నారు. త్వరలోనే దసరా కానుకగా రైతు భరోసా కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ అధికారి రమ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.