అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గల్ఫ్‌ బాధితుల కోసం ‘ప్రవాసి ప్రజావాణి’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రజావాణి తరహాలో వారానికి రెండు రోజులు (బుధ, శుక్ర) ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి ప్రారంభించారు. గల్ఫ్‌ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వారంలో రెండ్రోజులు కౌంటర్‌ తెరిచి ఉంటుందని పేర్కొన్నారు.