అక్షరటుడే, నిజామాబాద్ టౌన్ : జిల్లాలో ఆర్వోబీ, ఆర్‌యూబీ పనులపై సీనియర్‌ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని ఎంపీ అర్వింద్‌ కోరారు. దిశ సమావేశం అనంతరం ఆయన కలెక్టరేట్‌ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. సీనియర్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు పనులపై శ్రద్ధ పెట్టాలన్నారు. మామిడిపల్లి ఆర్వోబీ పనులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. గత ప్రభుత్వం రూ. 18 కోట్ల నిధులను పూర్తిగా డైవర్ట్‌ చేసిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రస్తుతం పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మాధవనగర్‌ ఆర్వోబీ పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. పనులను వేగవంతం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఉందన్నారు. పనికి మాలిన రాజకీయాలు మానుకుని రైల్వే పనులపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మంత్రిలాగా భావిస్తున్నామని.. ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.