అక్షరటుడే, ఆర్మూర్ : బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మెంబర్‌షిప్ ఇన్‌ఛార్జి పుప్పాల శివరాజ్ కుమార్ ముప్కాల్‌ మండలంలోని వివిధ శక్తి కేంద్రాల సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ 200 సభ్యత్వాలు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి శక్తి కేంద్రంలో పరిధిలో ఉన్న బూత్‌లలో నాయకులు వచ్చే 48 గంటలు బూత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ముప్కాల్ మండలాధ్యక్షుడు సంతోష్, గటడి నితిన్ కుమార్, మస్కు నర్సయ్య, రాజేశ్వర్, చింటూ తదితరులు పాల్గొన్నారు.