అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ప్రముఖ రచయిత్రి, బొజ్జతారకం భార్య విజయభారతి ఇవాళ అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతిచెందారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు సనత్‌నగర్‌లోని రెనోవా ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మరింత క్షీణించి ఇవాళ ఉదయం విజయభారతి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ కవి, రచయిత బోయి భీమన్న కుమార్తెనే విజయభారతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆమె పలు సాహిత్య అవార్డులు అందుకున్నారు.