అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని కబ్జా నుంచి కాపాడాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీకి అప్పటి ప్రభుత్వం 578 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని.. అందులో 50 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసిందన్నారు. కబ్జాదారులు కోర్టులో కేసు వేసి వర్సిటీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రిన్స్, రవీందర్,శివసాయి, వంశీ తదితరులు పాల్గొన్నారు.