అక్షరటుడే, వెబ్డెస్క్ : విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని విడుదలైన జీవో నెంబర్ 25 శాస్త్రీయంగా లేదని ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. మెదక్ జిల్లాలోని నిజాంపేట్ మండలంలోని నందిగామ, కల్వకుంట్ల, నార్లపూర్, చల్మెడ నిజాంపేట్, నస్కల్ పాఠశాలల్లో భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సీనియార్టీని గుర్తించకుండా ఎంఎన్వోలుగా ఉన్న వారిని మండల విద్యాధికారిగా ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడంపై నిరసనను తెలుపుతున్నట్లు జాక్టో ఛైర్మన్ రాజగోపాల్ గౌడ్ పేర్కొన్నారు. అలాగే మండలంలోని పలు పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య, జిల్లా నాయకులు నరేష్, సతీష్, మండలాల బాధ్యులు శ్రీకాంత్, నర్సిములు,ఎల్లం, జహీర్ తదితరులు పాల్గొన్నారు.