అక్షరటుడే, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా ఉదయ్‌నిధి స్టాలిన్ డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందారు. ఉదయ్ నిధి స్టాలిన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, దిగ్గజ ద్రావిడ నాయకుడు కరుణానిధి మనువడు అనే విషయం తెలిసిందే. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరో నలుగురికి కొత్తగా చోటు కల్పించారు. మనీలాండరింగ్ కేసులో 15నెలలపాటు జైలుకి వెళ్లి వచ్చిన సెంథిల్ బాలాజీ, డాక్టర్ గోవి చెళియాన్, ఆర్. రాజేంద్రన్, ఎస్‌ఎం నాసర్‌లు మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నారు. ఇవాళ రాజ్‌భవన్‌లో మంత్రులుగా వీరు ప్రమాణ స్వీకారం చేశారు. సెంథిల్‌కు విద్యుత్, ఎక్సైజ్ శాఖ, చెళియన్‌కు విద్యాశాఖ, నాజర్‌కు మైనార్టీ వ్యవహారాలు, రాజేంద్రన్‌కు పర్యాటక శాఖలను కేటాయించారు. కాగా.. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరే ముందు ఉదయ్‌నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి అనేది తనకు పదవి కాదని, ఓ పెద్ద బాధ్యత అని అన్నారు.