అక్షరటుడే, నిజామాబాద్: జిల్లా కేంద్రంలో త్వరలోనే 8 ట్రాక్ లతో భారీ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి మైదానం పరిశీలించి మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ మైదానం పరిరక్షణ కోసం ఎందరో పోరాటం చేశారని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్‌ సిటీ(ఫోర్త్‌ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్‌ హబ్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుతో పాటు, ఇక్కడే 12 క్రీడల అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వం భావిస్తోందన్నారు. అరకొర వసతులతోనే పూర్ణ, నిఖత్ జరీన్, యెండల సౌందర్య, హుసముద్దిన్ ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారన్నారు. జిల్లాలో స్టేడియం నిర్మాణం ద్వారా ఒలంపిక్ స్థాయిలో శిక్షణ ఇచ్చి దేశంలోనే నిజామాబాద్ ను ప్రత్యేక స్థానంలో నిలుపుదామన్నారు.