అక్షరటుడే, వెబ్డెస్క్ : కేసీఆర్ శకం ముగిసిందని, ఇప్పటికే ఆయనకు 75 ఏళ్లు అని, వచ్చే ఎన్నికల నాటికి 80 ఏళ్లు నిండుతాయని, అప్పటికి ఉంటాడో.. లేదో.. తెలియదని బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. పోరగాళ్లు పార్టీని నడుపుతారని.. వారికి ఎవరైనా ఓటువేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన రైతుదీక్ష ముగింపు సందర్భంగా అర్వింద్ మాట్లాడారు. రైతు దీక్షలను ప్రతి జిల్లాకు తీసుకెళ్తామన్నారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఒకే తరహా విధానాలు అవలంభిస్తున్నాయని విమర్శించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పేదల ఇళ్లనే కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.