అక్షరటుడే, ఆర్మూర్ : ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ను వాడకుండా నిషేధించాలని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హి సేవా ముగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం మొక్కలు నాటారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవంతంగా మున్సిపల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, కమిషనర్ రాజు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గన్నారు.