అక్షరటుడే, వెబ్‌ డెస్క్‌: దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్లో రూ. 11లక్షల కోట్లు ఆవిరయ్యాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌తో పాటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్‌ 1800 పాయింట్ల నష్టంతో 82,464 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 541 పాయింట్ల నష్టంతో 25,256 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా రిలయన్స్‌ షేర్లు భారీ నష్టాల్లో నడుస్తున్నాయి. ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న భయం ఇన్వెస్టర్లలో నెలకొంది.