అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రభుత్వ టీచర్ మాల్తీ వర్మకు సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. మీ కూతురు సెక్స్ రాకెట్‌లో దొరికిందని రూ.లక్ష ఇస్తే కేసు లేకుండా చేస్తామని చెప్పాడు. తన కూతురు గురించి అలాంటి వార్త వినడంతో ఆందోళనకు గురైన మాల్తీ వర్మ గుండెపోటుతో మరణించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.