అక్షరటుడే, ఇందూరు : అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. నగరంలోని నాగారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. నగరానికి 2500 ఇళ్లు మంజూరు అయితే గత ప్రభుత్వం 400 కట్టి ఉరుకుందన్నారు. ఇందులో 235 ఇళ్ల పనులు 90 శాతం పూర్తయినా పేదలకు కేటాయించలేదన్నారు. దీంతో వృథాగా ఉన్న ఇల్లు ప్రస్తుతం పనికిరాకుండా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నోసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. అయినా పట్టించుకోవడం లేదన్నారు.