అక్షరటుడే, వెబ్‌డెస్క్: గిరిజన తెగకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో నిరసన తెలుపుతూ మహారాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ సచివాలయం పైనుంచి దూకారు. ఈ అనూహ్య ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అజిత్‌పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ స్పీకర్ నరహరి ఝీర్వాల్ అసెంబ్లీలో మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకారు. అయితే భవనానికి ముందు జాగ్రత్తగా నెట్ కట్టి ఉండడంతో వారిరువురికి ఎలాంటి గాయాలు కాలేదు. గిరిజన తెగ ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) రిజర్వేషన్ కేటగిరీలో చేర్చడాన్ని వారు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు.