అక్షరటుడే, కామారెడ్డి : జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి జి.రజిత తెలిపారు. మానిటరింగ్ కమిటీ ఏర్పాటు కోసం ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ నుంచి నాన్ అఫీషియల్ ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తామన్నారు. ఎన్జీవో అనుబంధం ముగ్గురు సభ్యులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. సభ్యులుగా ఉండే వ్యక్తులపై ఎలాంటి పోలీస్ కేసులు ఉండరాదని సూచించారు. డిగ్రీ చదివి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ కోసం సేవచేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు. దరఖాస్తులను ఐడీఓసీలోని తమ కార్యాలయంలో అందించాలన్నారు.