అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్, రెగ్యులర్ బిల్లుల కోసం నిధులు విడుదల చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా 9, 10వ తరగతుల వంట ఖర్చులకు రూ. 2.21 కోట్లు మండలాల వారీగా విడుదల చేశామన్నారు. మండల విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు చెల్లించాలని ఆదేశించారు.