అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సోషల్‌ మీడియాను నమ్ముకుని అధికారంలోకి వస్తామని కేటీఆర్‌ కలలు కంటున్నాడని సీఎం రేవంత్‌ విమర్శించారు. చిల్లర పనులు చేస్తే కేటీఆర్‌కి చర్లపల్లి జైలులో చిప్పకూడు గ్యారంటీ అని సీఎం హెచ్చరించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన వెంకటస్వామి జయంతి సభకు ఆయన హాజరై మాట్లాడారు. రుణమాఫీలో రైతులు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్లను కలవాలని సూచించారు.