అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో ఏడు నెలల చిన్నారిని విక్రయించిన ఘటనలో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిపేట మండలం సిద్దాపూర్‌కు చెందిన లక్ష్మి పోశెట్టి దంపతులు ఆర్థిక ఇబ్బందులతో తమ కూతురిని అమ్మకానికి పెట్టగా ఓ ముఠా సభ్యులు కొనుగోలు చేశారు. చిన్నారిని పెర్కిట్‌లోని షేక్ హబీబీ, మహమ్మద్ గౌస్ దంపతులకు రూ.30 వేలకు విక్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.