అక్షరటుడే, కామారెడ్డి: భిక్కనూరు శివారులో లారీని డీసీఎం ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందగా క్లీనర్ కు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ నుంచి పండ్ల బాక్సులతో ఆదిలాబాద్ వెళ్తున్న ఓ డీసీఎం ఎదురుగా వస్తున్న మరో లారీని భిక్కనూరు శివారులో శనివారం అర్ధరాత్రి ఢీకొట్టింది. ఘటనలో డీసీఎం డ్రైవర్ షేక్ అబీద్, క్లీనర్ సంతోష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించగా, డ్రైవర్ అబీద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.