అక్షరటుడే, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజశ్యామల దేవి ఆశ్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయన్ను శాలువాతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఏబీవీపీ పూర్వ అధ్యక్షుడు నరేష్ ఉన్నారు.