అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని రామ్ నగర్ – అరుంధతి నగర్ మార్గంలోని మల్లారెడ్డి చెరువు ప్రాంతంలో చెత్త డంప్ ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. చెరువు ప్రాంతంలో వ్యర్థాలను డంప్ చేయడం, నిప్పంటించడంతో పొగ, దుర్గంధంతో కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులపై ‘నివాసాల మధ్య వ్యర్థాల డంప్’ లో శీర్షికన ‘అక్షరటుడే’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు స్పందించారు. వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించడంతో కార్మికులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.