అక్షర టుడే, ఇందూరు: భీంగల్ మండలంలో తప్పుడు ధ్రువపత్రాలతో రెండు ప్రైవేటు పాఠశాలలను కొనసాగిస్తున్నారని, వీటిపై సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఫిర్యాదు చేసినట్లు బీసీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి శేఖర్ తెలిపారు. ఎంఈవోను ప్రశ్నిస్తే తమతో ఇష్టానుసారంగా మాట్లాడారని, మండలంలోని కృష్ణవేణి, కృషి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంఈవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.