అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ గెలవడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటన్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని.. కాంగ్రెస్‌ మాటలు ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చింతల రామచంద్ర రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.